దేశవ్యాప్తంగా నిరాడంబరంగా వినాయక చవితి ఉత్సవాలు

ఖైరతాబాద్ గణేషుడు కూడా ఈ ఏడు 9 అడుగులకే పరిమితం

Lord Vigneswara
Lord Vigneswara

New Delhi: దేశవ్యాప్తంగా  వినాయక చవితి ఉత్సవాలు కరోనా కారణంగా నిరాడంబరంగా జరుగుతున్నాయి.

దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రజలు గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటున్నారు.

వాడవాడల్లో ప్రతిష్టించే భారీ గణేషులు ఈ సారి దర్శనం ఇవ్వడం లేదు. తక్కువ ఎత్తులో పరిమిత భక్తులను మాత్రమే అనుమతిస్తే చవితి పండుగ జరుగుతోంది.

ఇక ఏటా భారీ గణేష విగ్రహంతో దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఖైరతాబాద్ గణేషుడు కూడా ఈ ఏడు 9 అడుగులకే పరిమితమయ్యాడు.

కోవిడ్ నిబంధనల ప్రకారం ఖైరతాబాద్ గణేషుడి పూజల్లో ప్రజలు నేరుగా పాల్గొనే అవకాశం లేదు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/