షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర షెడ్యూల్ ఖరారు

హైదరాబాద్ : వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టబోయే ‘‘ప్రజా ప్రస్థానం’’ పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. పాదయాత్రను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు షర్మిల్. మార్చి 10 నుంచి పాదయాత్ర పునఃప్రారంభం కానున్నట్లు షర్మిల ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 9న ఎన్నికల కోడ్ కారణంగా కొండపాక గూడెం వద్ద షర్మిల పాదయాత్ర ఆగిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా కొండపాక గూడెం గ్రామం నుంచి షర్మిల పాదయాత్రను మొదలుపెట్టనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/