వినరో భాగ్యము విష్ణు కథ ఫస్ట్ డే కలెక్షన్స్

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరో కిరణ్ అబ్బవరం. 2019 లో రాజావారు రాణిగారు మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన కిరణ్..ఎస్ఆర్ కల్యాణమండపం, సెబాస్టియన్ పి.సి.524 , సమ్మతమే ‘ చిత్రాలతో అలరించాడు. ఇక ఇప్పుడు మహా శివరాత్రి సందర్బంగా వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశ్మీర పరదేశీ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. దీనికి చైతన్ భరద్వాజ్ సంగీతం ఇచ్చారు. ఇందులో మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు నటించారు.

అల్లు అరవింద్ సమర్పణలో రావడం తో సినిమా ఫై ఆసక్తి పెరిగింది. సినిమాకు పెద్దగా టాక్ రానప్పటికీ , మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టింది. నైజాంలో రూ. 66 లక్షలు, సీడెడ్‌లో రూ. 23 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో కలిపి.. రూ. 1.35 కోట్లు షేర్, రూ. 2.50 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 7 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 9 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు రూ. 1.51 కోట్లు షేర్‌తో పాటు రూ. 2.85 కోట్లు గ్రాస్ సాధించింది.