ఈడీ విచారణకు హాజరైన రాజస్థాన్‌ సీఎం కుమారుడు వైభవ్‌ గెహ్లాట్‌

Ashok Gehlot’s Son Appears Before Probe Agency In Delhi

న్యూఢిల్లీ: ఈడీ విచారణ రాజస్థాన్‌ సిఎం అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ గెహ్లాట్‌ ఈకు హాజరయ్యారు. విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి వైభవ్‌కు ఈ నెల 26న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు.

కాగా, రాజస్థాన్‌కు చెందిన హాస్పిటాలిటీ గ్రూప్‌ ట్రైటన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వర్ధన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థలు 2007-2008 సంవత్సరంలో మారిషెస్‌ నుంచి అక్రమంగా పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలపై వైభవ్‌కు ఈడీ తాఖీదులిచ్చింది. ఆయనతోపాటు ఆ రెండు సంస్థల డైరెక్టర్లు అయిన శివ్‌ శంకర్‌ శర్మ, రతన్‌కాంత్‌ శర్మకు కూడా నోటీసులిచ్చింది. రతన్‌కాంత్‌తో ఉన్న సంబంధాలపై వైభవ్‌ను ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.