కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై విజయసాయిరెడ్డి విమర్శలు

vijayasaireddy

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ పై విమర్శలు గుప్పించారు. అక్టోబరు 7న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పదవి రేసులో తాను లేనంటూ రాహుల్ గాంధీ సంకేతాలు ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై విజయసాయిరెడ్డి విమర్శనాత్మకంగా స్పందించారు.

పార్టీని నడపడానికి అవసరమైన పరిణతి రాహుల్ గాంధీకి వచ్చేంత వరకు కుర్చీలో తాత్కాలికంగా కూర్చునే వ్యక్తి కోసం అన్వేషించడమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వెనకున్న ఉద్దేశం అని విజయసాయి వివరించారు. ఏ పార్టీకి కూడా రెండు శక్తి కేంద్రాలు ఉండజాలవని అభిప్రాయపడ్డారు. పీవీ నరసింహారావు పట్ల ఆ పార్టీ వ్యవహరించిన తీరును తెలుగు ప్రజలు మర్చిపోలేరని విజయసాయి వ్యాఖ్యానించారు. కాగా, ఈసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో గాంధీలు ఉండబోరన్న ప్రచారం నేపథ్యంలో, అధ్యక్ష పదవి ఆశావహుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రధానంగా పోటీ అశోక్ గెహ్లాట్, శశి థరూర్ మధ్య ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/