వారు భద్రంగా ఉన్నప్పుడే దేశం ముందంజ వేస్తుందిః రాహుల్‌ గాంధీ

ఈ ఘటనలు దిగ్భ్రాంతికి గురిచేశాయన్న రాహుల్ గాంధీ

rahul-gandhi-opines-that-india-will-progress-when-women-are-safe

న్యూఢిల్లీః ఉత్తరాఖండ్ లో బిజెపి నేత కుమారుడు ఓ రిసెప్షనిస్టును హత్య చేయడం, యూపీలోని మొరాదాబాద్ లో అత్యాచారానికి గురైన యువతి నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిన ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడే భారత్ అభివృద్ధి పథంలో పయనిస్తుందని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్, మొరాదాబాద్ లో అమ్మాయిల పట్ల జరిగిన ఈ ఘటనలు ప్రతి ఒక్కరినీ నివ్వెరపరిచాయని పేర్కొన్నారు.

భారత్ జోడో యాత్రలో తాను ఎంతోమంది ప్రతిభావంతులైన బాలికలను, యువతులను కలుస్తున్నానని, వారి ఆలోచనలను వింటున్నానని తెలిపారు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం…. వారు భద్రంగా ఉన్నప్పుడే దేశం ముందంజ వేస్తుంది అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్ లో ఓ బిజెపి నేత కుమారుడు, మరో ఇద్దరు రిసార్ట్ ఉద్యోగులు లేడీ రిసెప్షనిస్ట్ హత్యలో పాలుపంచుకోవడం తెలిసిందే. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/