దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు

కొత్త రథం తయారీకి రూ.95 లక్షలు మంజూరు

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: ఇటీవ‌ల అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం ‌ అగ్నికి ఆహుతైన ఘ‌ట‌న‌పై ఏపి ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..ప్రతిపక్ష పార్టీలకు కౌంట‌ర్ ఇచ్చారు. ‘రాజకీయ కుట్రలు, కుతంత్రాలను ఉపేక్షించేది లేదు. వర్గ వైషమ్యాలు సృష్టించాలనుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంతర్వేది ఘటనలో దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు. కొత్త రథం తయారీకి రూ.95 లక్షలు మంజూరు చేసింది జగన్ గారి సర్కార్. నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతోంది’ అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/