ఎన్నారై అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా: లోకేష్

ప్రభుత్వ తప్పులను , అవినీతిని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా ?

nara Lokesh condemned the NRI arrest
nara Lokesh condemned the NRI arrest

అమరావతి: ఎన్నారై యాష్ బొద్దులూరి ని హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. శనివారం ఉదయం లోకేష్ ట్వీట్ చేశారు. ఎన్నారైని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పులను , అవినీతిని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా ? అని ప్రశ్నించారు. స్వేచ్ఛగా అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు లేదా? అని నిలదీశారు. రాష్ట్రంలో రాజా రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని , అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూడటానికి స్వదేశానికి వస్తే ఎయిర్ పోర్ట్ లోనే అరెస్ట్ చేయటం దుర్మార్గమని , ఓటమి భయంతో దుర్మార్గాలకు తెగబడుతున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ నియంతృత్వ పోకడలకు మూల్యం చెల్లించక తప్పదు .. అంటూ లోకేష్ ట్వీట్ పోస్ట్ చేశారు.