చంద్రబాబు నీ అడ్రసు గల్లంతవక తప్పదు

విజయసాయిరెడ్డి… చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజసాయిరెడ్డి , టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. ‘బాబూ… ఆరు వారాలు కాదు, 60 వారాల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగినా నీ అడ్రసు గల్లంతవక తప్పదు. వ్యవస్థల్లో నీ మనుషులున్నారు కదా అని ఎలక్షన్లు నిలిపి వేయించావ్. 5 వేల కోట్ల రూపాయల నిధులు రాకుండా చేసి ఐదు కోట్ల మంది ప్రజలకు ద్రోహం చేశావు. నీ నీచ రాజకీయాల చరమాంకానికి నువ్వే దారి వేసుకున్నావ్’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/