సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

సీఏఏ పై చర్చ సందర్భంగా సిఎం సుదీర్ఘ ప్రసంగం

cm kcr
cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈరోజు అసెంబ్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం చర్చను ప్రారంభించారు. ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ..ఇది భారత్‌కు మంచిది కాదన్నారు. దేశంలో లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగంపై నమ్మకం ఉన్నవారు… సీఏఏని వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారని తెలిపారు. భిన్న సంస్కృతుల తెలంగాణలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటామన్న కెసిఆర్‌… లోక్‌సభలో సీఏఏ బిల్లును తెచ్చినప్పుడు కూడా వ్యతిరేకించినట్లు తెలిపారు. సీఏఏ వంటి చట్టాల వల్ల దేశ ప్రతిష్ఠ మంటగలుస్తోందన్నారు. కొన్ని కోట్ల మందికి సర్టిఫికెట్లు లేవని, ఈ పరిస్థితుల్లో దేశంలో విభజన రాజకీయాలు మంచిది కాదన్నారు. టీఆర్ఎస్ లౌకిక పునాదులపై ఏర్పడిందని, దానికే కట్టుబడి ఉంటుందన్నారు. అసహన వైఖరి, భావోద్వేగాలను రెచ్చగొట్టడం సరైన విధానం కాదని కెసిఆర్‌ అన్నారు. కాగా’నేను చింతమడకలోని మా ఇంట్లో పుట్టాను. అప్పట్లో మా పెద్దోళ్లు ఊళ్లో ఉండే పెద్దమనుషులను పిలిపిం చి వారి సమక్షంలో నా జన్మపత్రిక రాయించారు. అంతేతప్ప ఎటువంటి సర్టిఫికెట్ లేదు’ అని వివరించారు. ఈ పరిస్థితుల్లో దళితులు, గిరిజనులు, కూలీనాలీ చేసుకునే జనం, ఓసీల్లో పేదల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించాలని కోరారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/