బకాయిలు చెల్లిస్తాను..కేసులు కొట్టేయండి

బేషరతుగా తీసుకోవాలని విన్నపం..కేంద్రం ఆర్థిక ప్యాకేజీపై అభినందనలు

vijay mallya
vijay mallya

న్యూఢిల్లీ: వేల కోట్ల రుణాలను తీసుకున్న ప్రముఖ వ్యాపారవ్తేత విజయ్ మాల్యా  బ్రిటన్ కు పారిపోయిన విషయం తెలిసిందే. భారత్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాను చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని తన ప్రతిపాదనను ప్రభుత్వం మన్నించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి అభ్యర్థించారు.. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. ఈనేపథ్యంలో మాల్యా కేంద్ర ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై అభినందనలు తెలుపుతు.. తన విన్నపాన్నిపై ట్విట్‌ చేశారు.

‘కొవిడ్ 19 రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వారు తమకు కావాల్సినంత డబ్బును ముద్రించుకోగలరు. కానీ నా వంటి చిన్న వ్యక్తి, బ్యాంకులకు చెల్లించాల్సిన 100 శాతం మొత్తాన్ని ఇస్తానంటే మాత్రం తీసుకునేందుకు అంగీకరించడం లేదు. దయచేసి నా డబ్బు బేషరతుగా తీసుకుని క్లోజ్ చేయండి.. అని ట్వీట్ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/