మరో బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా

North Korea Launches Another ICBM, One of Its Most Powerful Yet

ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా దూకుడు తగ్గడంలేదు. శుక్రవారం కూడా క్షిపణి పరీక్ష నిర్వహించింది. అమెరికా ప్రధాన భూభాగాన్ని ఇది తాకగలదని జపాన్ రక్షణ శాఖ మంత్రి యసుకజు హమదా పేర్కొన్నారు. ఈ మిసైల్ 15,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కొట్టి పడేయగలదన్నారు.

ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం రెండు వారాల వ్యవధిలో రెండోసారి. ఈ క్షిపణి జపాన్ కు చెందిన హొక్కయిదో దీవి ఉత్తరాన ఒషిమా-ఒషిమా పశ్చిమాన 200 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ అయింది. ఇది తమ సముద్ర జలాల్లో పడినట్టు జపాన్ ప్రధాని కిషిదా ప్రకటించారు. తమకు ఆమోదనీయం కాదన్నారు.

ఈ నెల 3న కూడా ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించగా, అది లక్ష్యాన్ని చేరడంలో విఫలమైనట్టు నిపుణులు చెబుతున్నారు. ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ హాసంగ్-17 అనే క్షిపణి అభివృద్దిలో భాగంగా ఉత్తర కొరియా ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. మొదటి నుంచి ఉత్తర కొరియా అడపా, దడపా క్షిపణి పరీక్షలు నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. తద్వారా అమెరికా తమ జోలికి రాకుండా చేసుకోవడమే ఆ దేశ లక్ష్యంగా ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/