పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ కపూర్

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. ఆగస్టు 20న తాను ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోనమ్‌ అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులు, నర్సులు అందరికీ థాంక్స్ తెలియజేస్తూ ఓ నోట్‌ విడుదల చేశారు.

‘‘ఈ ప్రపంచంలోకి పండంటి మగ బిడ్డకు మేం స్వాగతం పలుకుతున్నాం. ఈ ప్రయాణంలో మాకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, డాక్టర్స్, నర్సులకు కృతజ్ఞతలు. ఇది ప్రారంభం మాత్రమే. కానీ, మా జీవితాలు శాశ్వతంగా మారుతాయని అందరికీ తెలుసు. మీ సోనమ్, ఆనంద్’’ అని ఇన్‌స్టాలో ఆమె ఓ పోస్ట్ పెట్టింది. ఈ శుభవార్తను తెలిపిన కాసేపటికే సోనమ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ సెలబ్రిటీస్ కామెంట్స్ పోస్ట్ చేశారు.

అనిల్ కపూర్ కూతురిగా సోనమ్ కపూర్ ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘సావరియా’ తో హీరోయిన్ గా మారింది. ‘నీర్జా’, ‘ప్యాడ్ మ్యాన్’, ‘సంజు’ వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. సోనమ్ కపూర్ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ అహుజా ను 2018లో పెళ్లి చేసుకుంది.