సలార్ లో విజయ్ దేవరకొండ..నిజమేనా..?

Vijay Deverakonda in Salaar..is it true..?

Community-verified icon


గీత గోవిందం , అర్జున్ రెడ్డి మూవీస్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ..ప్రస్తుతం ఖుషి మూవీ చేస్తున్నాడు. ఈ తరుణంలో విజయ్ ..ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడనే వార్త ఇప్పుడు అభిమానుల్లో సంతోషం నింపుతుంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్రభాస్ పోస్ట‌ర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితియార్థంలో విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ లో విజయ్ దేవరకొండ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ.. ప్రభాస్ కి తమ్ముడు క్యారెక్టర్ లో నటించబోతున్నాడని అంటున్నారు. మరి ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ విజయ్ అభిమానులు మాత్రం నిజం కావాలని కోరుకుంటున్నారు.