లవ్ స్టోరీ తో విజయ్ దేవరకొండ థియేటర్ బిజినెస్ స్టార్ట్

mahabubnagar

చిత్రసీమలో అతి తక్కువ టైములో పాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. కేవలం సినిమాలతోనే కాకుండా సొంతంగా బిజినెస్ లు కూడా చేస్తూ రాణిస్తున్నారు. రౌడీ బ్రాండ్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని విజయవంతంగా చేస్తున్న విజయ్..ఇప్పుడు మల్టిఫ్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ తో కలసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు.

తన స్వస్థలమైన మహాబూబ్‌నగర్‌లో ఈ మల్టీప్లెక్స్‌ థియేటర్ ను ఏర్పాటు చేసారు. ఈ మల్టీప్లెక్స్‌కు ఎవిడి సినిమాస్ అని పేరు పెట్టారు. ఈ థియేటర్ లో మొదటగా లవ్ స్టోరీ మూవీ ప్రదర్శిస్తున్నారు. సెప్టెంబర్ 24 న విడుదల కాబోతున్న ఈ మూవీ తో విజయ్ థియేటర్ బిజినెస్ మొదలుకాబోతుంది. గతంలో ఏషియన్ సినిమాస్ తోనే కలసి మహేష్ బాబు AMB సినిమాస్ ను స్టార్ట్ చేసారు. అలాగే అల్లు అర్జున్ కూడా ఏషియన్ సినిమాస్ తో అమీర్ పేట సత్యం థియేటర్ ప్లేస్‌లో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా వారి జాబితాలో చేరారు.

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పూరి డైరెక్షన్లో లైగర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది.

Avd Cinemas Ready to…🤙🏻 #AVD Is Ready 🔥🤩

Opening Date Announcement Soon 😍@TheDeverakonda #VijayDeverakonda #AVDCinemas pic.twitter.com/dVM0BBPw0H— Vijay Deverakonda Fans (@VDKROWDY) September 11, 2021