మా ఎన్నికల పోటీలో రఘుబాబు..

మా ఎన్నికల పోటీలో రఘుబాబు..

‘మా’ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మరింత ఆసక్తి పెరుగుతుంది. మా అధ్యక్ష పీఠం కోసం మంచు విష్ణు , ప్రకాష్ రాజ్ లు పోటీపడుతున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యుల వివరాలు తెలుపుగా..తాజాగా మంచు విష్ణు ప్యానల్ నుండి నటుడు రఘుబాబు బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం.

విష్ణు ప్యానల్‌ నుంచి ప్రధాన కార్యదర్శి పదవి కోసం రఘుబాబు పోటీలోకి దిగుతున్నారు. జనరల్‌ సెక్రటరీ గా విజయం సాధించేందుకు ఇప్పటికే ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఫిలిం సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి జనరల్‌ సెక్రటరీ పదవి కోసం జీవిత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే నిర్మాత బండ్ల గణేశ్‌ స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నారు. మొత్తం మీద మా ఎన్నికలు వేడి పొలిటికల్ ఎన్నికలను మించి ఉంది.