విజయ్ కి జోడిగా బుట్టబొమ్మ

టాలీవుడ్ టాప్ బిజీ హీరోయిన్ గా చలామణి అవుతున్న పూజా హగ్దే..తాజాగా మరో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. రౌడీ హీరో..యూత్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ఈ భామ జోడి కట్టబోతుంది. విజయ్ దేవరకొండ – పరుశురాం కలయికలో ఓ మూవీ తెరకెక్కుతుంది.

 దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా ను ఖరారు చేసినట్లు సమాచారం. గతంలో విజయ్ – పరుశురాం కలయికలో గీత గోవిందం మూవీ వచ్చి , యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రావడం..పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుండడం తో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

ప్రస్తుతం పూజా..త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతునన్ గుంటూరు కారం మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. రాబోయే సంక్రాంతి కి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే విజయ్ ..ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్లో ఖుషి మూవీ లో నటిస్తున్నాడు. ఈ మూవీ లో విజయ్ కి జోడిగా సమంత నటిస్తుంది.