కొల్లు ర‌వీంద్ర‌కు బెయిల్ మంజూరు

అరెస్టులకు భయపడబోనన్న కొల్లు ర‌వీంద్ర

అమరావతి: ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం జిల్లా కోర్టుకు ఆయ‌న‌ను తరలించారు. అయితే, పోలీసులు ఆయ‌న అరెస్టు ప‌ట్ల స‌రైన ప్ర‌క్రియ‌ను అనుస‌రించ‌లేద‌ని చెబుతూ, న్యాయ‌మూర్తి కొల్లు రవీంద్రకు బెయిల్‌ మంజూరు చేశారు.

అనంతరం కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ..తాను అరెస్టులకు భయపడబోన‌ని చెప్పారు. వైస్సార్సీపీ పాల్ప‌డుతోన్న‌ అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. న్యాయం కోసం ప్ర‌శ్నిస్తే త‌న‌పై కేసు పెట్టారని, అయిన‌ప్ప‌టికీ తాము న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా‌మ‌ని చెప్పుకొచ్చారు.


అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/