అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేసిన విజయ్ దేవరకొండ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డు ను విజయ్ దేవరకొండ బ్రేక్ చేసాడు. విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్ రేపు వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ఈ మూవీని ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించగా.. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. ఇక ఈ మూవీ రిలీజ్ కు ముందే అనేక రికార్డ్స్ ను బ్రేక్ చేసింది.

‘లైగర్’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలోనే విడుదల కాబోతుంది. నైజాంలో 320, సీడెడ్‌లో 190 థియేటర్లలో రాబోతుంది. అలాగే, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల్లో కలిపి 420 థియేటర్లలో ప్రదర్శితం అవబోతుంది. ఇక తమిళనాడులో 100, కర్నాటకలో 100, కేరళలో 100, హిందీ ప్లస్ రెస్టాప్ ఇండియాలో 1000, ఓవర్సీస్‌లో 700 థియేటర్లలో తీసుకు వస్తున్నారు. మొత్తంగా 3000 థియేటర్లలో రాబోతుంది. దీంతో విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్లలో విడుదల అవుతోన్న చిత్రంగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. మరోపక్క అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ (3000 థియేటర్లు), పవన్ కల్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ (2800 థియేటర్లు) రికార్డులను లైగర్ దాటివేయడంతో ఫస్ట్ డే కలెక్షన్లు రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.