వాళ్లు ఉన్నది ప్రజల కోసమా? పార్టీ కోసమా?

వాలంటీర్ ఆత్మహత్యాయత్నంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చంద్రబాబు

chandrababu naidu
chandrababu naidu

హైదరాబాద్‌: టిడిపి అధినేత చంద్రబాబు జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. కరోనా సాయం కింద ప్రజలకు అందిస్తున్న వెయ్యి రూపాయాల సాయాన్ని వైఎస్‌ఆర్‌సిపి నేతలే ఇస్తామని ఎలా చెబుతారన్నారు. దీనికి ఒప్పుకోని వాలంటీర్లను విధుల్లోంచి తొలగించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ఉన్నది ప్రజల కోసమా? పార్టీకోసమా అని ప్రశ్నించారు. కాగా విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస మండలం, గెడ్డతిరువాడకు చెందిన బొంగు కార్తీక్, గోపిశెట్టి ఝాన్సీలను వైఎస్‌ఆర్‌సిపి నేతల మాట వినలేదని విధుల్లోంచి తొలగించారు. ప్రజల డబ్బుతో వాలంటీర్లను నియమించింది. వైఎస్‌ఆర్‌సిపి నేతలకు వంగివంగి దండాలు పెట్టడానికా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/