రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..సీఎం జగన్

YouTube video
Hon’ble CM of AP will be Participating in YSR Rythu Dinostavam and Public Meeting at Rayadurgam LIVE

అనంతపురం: రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, జలయజ్ఞంతో రాష్ట్ర రూపురేఖలను మార్చిన ఘనత వైఎస్‌ఆర్‌ది అని సీఎం జగన్‌ గుర్తుచేశారు. మనది రైతుపక్షపాత ప్రభుత్వమని, రెండేళ్లలో రైతుల కోసం రూ.8,670 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలబడ్డామని సీఎం జగన్‌ తెలిపారు.

పెట్టుబడిసాయం కింద రైతన్నలకు ఏటా రూ.13,500 ఇస్తున్నామని, రెండేళ్లలో రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు ఇచ్చామని సీఎం జగన్‌ తెలిపారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని, ప్రతి పంటకు ఈ-క్రాపింగ్‌ చేయిస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు. ఏ పంట వేశారు? ఎన్ని ఎకరాల్లో వేశారనే వివరాలు ఆర్‌బీకేల్లో రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/