సంజీవయ్య పేరును ఆ జిల్లాకు పెట్టాలి : వీహెచ్ డిమాండ్

ఉమ్మడి ఏపీ సీఎంగా సంజీవయ్య ఎంతో చేశారు

హైదరాబాద్: ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జిల్లాలు, జిల్లాల కేంద్రాలపై ఇప్పటికే పలు కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు తెలంగాణ నుంచి కూడా ఓ డిమాండ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఈ డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ఎంతో చేశారని వీహెచ్ కొనియాడారు. కర్నూలు జిల్లాకు చెందిన సంజీవయ్య పేరును ఆ జిల్లాకు పెట్టాలని చెప్పారు. కడపకు వైయస్సార్, విజయవాడకు ఎన్టీఆర్, మన్యం ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన జగన్ కు… దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలనే ఆలోచన రాకపోవడం సిగ్గు చేటని అన్నారు. జగన్ దీనిపై పునరాలోచించాలని.. కర్నూలకు సంజీవయ్య పేరు పెట్టాలని సూచించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/