రామారావు ఆన్ డ్యూటీ నుండి వేణు తొట్టెంపూడి లుక్ రిలీజ్

మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ లో సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈయన తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ బుధువారం సాయంత్రం రిలీజ్ చేసారు. ఈ మూవీ లో సీఐ ముర‌ళీగా వేణు కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు కామెడీ తో కనిపించిన వేణు.. ఈ సారి మాత్రం సీఐగా కొంచెం సీరియ‌స్‌గానే క‌నిపిస్తున్నాడు. కొంతకాలం క్రితం హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వేణు, సినిమాలను పక్కన పెట్టేసి చాలా కాలమైంది. ఈ సినిమాతో ఆయన రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. డెబ్యూ డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం యూనిక్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్కుతోంది. దివ్యాంక కౌశిక్ , ర‌జిష విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో స‌ర్ప‌ట్టా ఫేం జాన్ విజ‌య్‌, చైత‌న్య‌కృష్ణ‌, నాజ‌ర్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్ ఇత‌ర కీ రోల్స్‌ పోషిస్తున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. జులై 29న గ్రాండ్‌గా థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది. ర‌వితేజ దీంతోపాటు సుధీర్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో రావ‌ణాసుర సినిమా చేస్తున్నాడు. మ‌రోవైపు త్రినాథ రావు న‌క్కిన డైరెక్ష‌న్‌లో చేస్తున్న ధ‌మాకా చిత్రం కూడా షూటింగ్ ద‌శ‌లో ఉంది. పాన్ ఇండియా ప్రాజెక్టు టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు కూడా ట్రాక్‌పై ఉంది.