సంక్షోభంలో బొరిస్ స‌ర్కార్.. మరో నలుగురు మంత్రుల రాజీనామా

Four more ministers resigned in Britain

లండన్: బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఆర్థిక మంత్రి రిషి సునాక్​, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్​ రాజీనామా చేయగా.. తాజాగా మరో నలుగురు మంత్రులు అదే బాటలో పయనించారు. మొదట శిశు, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విల్​ క్విన్స్​, రవాణాశాఖ మంత్రి లారా ట్రాట్​ రాజీనామా చేశారు. తర్వాత కొద్ది సేపటికే మంత్రులు జాన్​ గ్లెన్​, విక్టోరియా అట్కిన్స్​ తమ పదవులకు రాజీనామా సమర్పించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఉన్నత పదవిలో కూర్చోబెట్టారని క్విన్స్​ విమర్శించారు. ఈ తరుణంలో తనకు రాజీనామా తప్ప మరో మార్గం లేదని లేఖలో తెలిపారు. బోరిస్ జాన్సన్​ ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినందుకే రాజీనామా చేస్తున్నట్లు రవాణా మంత్రి లారా ట్రాట్ చెప్పారు.

ప్రభుత్వాన్ని వీడడం బాధగా ఉందని.. కానీ ఇక్కడ కొనసాగలేకే ఈ నిర్ణయానికి వచ్చానని సునాక్​ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బ్రిటన్​ను కర్మభూమిగా కీర్తించిన సునాక్.. తన లాంటి వారు సైతం ఛాన్సలర్​ అయ్యే అవకాశం ఇక్కడ ఉందన్నారు. పించర్​ ఆరోపణలపై ప్రభుత్వం పారదర్శకమైన విచారణ చేపట్టాలని ప్రజలు ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏ ప్రమాణాల కోసం రాజీనామా చేశానో.. వాటి కోసం పోరాడుతానన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/