రఫ్ లుక్ తో వెంకీ

 Venky with Mass look
Venky with Mass look

తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసుసరన్ మూవీని తెలుగులో వెంకటేశ్ కథా నాయుకిడిగా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు.. కలైపులి యస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రపు ఫస్ట్ లుక్.. టైటిల్ ను మంగళవారం అర్థరాత్రి.. సరిగ్గా పన్నెండు గంటలకు (అంటే.. బుధవారంలోకి అడుగు పెట్టినంతనే విడుదల చేశారు.
ఇటీవల కాలంలో వెంకీ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండటం. ఫస్ట్ లుక్ పేరుతో మూడు పోస్టర్లను రిలీజ్ చేసి.. సినిమా మీద అందరూ చర్చించుకునేలా చేయటంలో శ్రీకాంత్ అడ్డాల సక్సెస్ అయ్యారు. రఫ్ లుక్ తో భయపెట్టేలా వెంకీ ఉన్నాడు. ఆగ్రహం.. ఆవేశాన్ని కలగలిపి కత్తి పట్టుకొని వస్తున్న లుక్ ఒకటైతే.. రక్తం పట్టిన కత్తి ఆగ్రహంతో ఊగిపోతున్న ముఖానికి దగ్గరగా ఉన్న లుక్ మరకొటి.. ఆకాశం లోకి దీనంగా చూస్తున్న మరో లుక్ తో కనిపించాడు వెంకీ