ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్న సిఎం కెసిఆర్‌

తీవ్ర జ్వరం రావడంతో యశోద ఆసుపత్రిలో చేరిక

CM KCR
CM KCR

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ అస్వస్థతతో సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో చేరారు. కెసిఆర్‌ జ్వరంతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. నిన్న రాత్రి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు ప్రత్యేక వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది. సుమారు 9 గంటల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యశోదా ఆస్పత్రికి తీసుకొచ్చారు. కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి కూడా ఆస్పత్రికి వచ్చారు. సుమారు గంటపాటు ఆయనకు పలు రకాల టెస్టులు నిర్వహించినట్టు తెలిసింది. టెస్టు రిపోర్టులన్నీ పరిశీలించిన వైద్యులు.. సాధారణ జ్వరమేనని, అయితే విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించారు. కాగా కెసిఆర్‌కు వైద్యులు ఎటువంటి ప్రమాదమూ లేదని చెప్పగా, ఆయన ఇంటికి వెళ్లిపోయారు. కెసిఆర్‌ వెంట ఆయన భార్య శోభ, కుమార్తె కవిత, ఎంపీ సంతోష్ కుమార్‌, మనవడు హిమాన్షు తదితరులు ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగానే వుందని వైద్యులు చెప్పిన తరువాత, చివరలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ వచ్చారు. ఆపై కెసిఆర్‌ కేవలం స్వల్ప జ్వరంతో బాధపడ్డారని, అది కూడా తగ్గిందని, ఆందోళన అనవసరమని ఆయన తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/