జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. శనివారం తెల్లవారుజామున అనంత్‌నాగ్, కుల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్‌నాగ్‌లోని సిర్హమా ప్రాంతంలో, కుల్గామ్‌లోని చకీ సమాద్, డీహెచ్ పొరా ప్రాంతాల్లో ముష్కరులు దాక్కున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.
భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. అనంత్‌నాగ్‌లో చనిపోయిన ఉగ్రవాది లష్కరే తొయిబాకు చెందినవాడని, కుల్గామ్‌లో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన టెర్రరిస్టును మట్టుబెట్టామన్నారు. రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/