నీకోసం అనంతమైన ప్రేమను పంపుతున్నాను అంటూ సామ్ కు వెంకటేష్ కూతురు ట్వీట్

మయోసిటిస్‌ అనే ప్రమాద వ్యాధి తో సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ స్వయంగా ఆమె చెప్పడం తో అంత ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. సినీ , రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఇలా యావత్ సినీ లవర్స్ సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున సామ్ త్వరగా ఈ వ్యాధి నుండి బయటపడాలని దేవుడ్ని కోరుకుంటున్నారు. చిరంజీవి , నాని , ఎన్టీఆర్, అఖిల్ ,నాగబాబు, జాన్వీ కపూర్, సుస్మిత కొణిదెల ,కృతి సనన్, మంచు లక్ష్మి తదితరులంతా సమంతకు అండగా నిలవడం జరిగింది. అంతేకాకుండా సమంతని ధైర్యంగా ఉండమని త్వరగా కోలుకొని వస్తావని ఆకాంక్షిస్తూ లవ్ సింబల్స్ ను, హార్ట్ సింబల్స్ ను పోస్టులు జతచేస్తున్నారు.

తాజాగా హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత దగ్గుబాటి సమంత ఆరోగ్యం పైన స్పందించడం జరిగింది. నీలో నీకు తెలియనంత గొప్ప శక్తి ఉంది.. నీకోసం అనంతమైన ప్రేమను పంపుతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇక అంతే కాకుండా అక్కినేని కుటుంబం నుంచి అఖిల్, సుశాంత్ మాత్రమే సమంత ఆరోగ్యం పైన స్పందించడంతో నాగచైతన్య, నాగార్జున, అమల ఫై కాస్త కోపం వ్యక్తం చేస్తున్నారు.