ఢిల్లీ ప్రార్థనల నుంచి వచ్చిన వారిని గుర్తిస్తున్నాం

ఇప్పటిదాకా 87 కరోనా కేసులు: ఎపి సిఎం జగన్‌ వెల్లడి

ఢిల్లీ ప్రార్థనల నుంచి వచ్చిన వారిని గుర్తిస్తున్నాం
AP CM YS Jagan

Amaravati: రాష్ట్రం నుంచి ఢిల్లీ జమాత్‌కు వెళ్లివచ్చిన వారికి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందని సిఎం జగన్‌ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఢిల్లీ నుంచి వచ్చిన వారిని ముమ్మరంగా గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని ఆ పని జరుగుతోందన్నారు..

రాష్ట్రం నుంచి 1,085 మంది ఢిల్లీ జమాత్‌కు వెళ్లారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం 87 కరోనా కేసులునమోదు అయ్యాయని, వీటిలో 70 పాజిటిల్‌ కేసులున్నాయని, ఇవి ఢిల్లీ జమాత్‌కు వెళ్లినవారివే అని అన్నారు.

రెండు రోజులుగా కేసులు బాగా పెరిగాయన్నారు.. ఢిల్లీకి వెళ్లివచ్చినవారితో సన్నిహితంగా ఉన్నవారిని త్వరిత గతిన గుర్తించే చర్యలు జరుగుతున్నాయన్నారు. కరోనాతో భయం వద్దు అని పేర్కొన్నారు.

ఈ తరుణంలో ప్రైవేటు వైద్యశాలలకు సంబంధించి వైద్యులు, నర్సులు పూర్తి అంకితభావంతో పనిచేయటానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఢిల్లీకి వెళ్లివచ్చిన 585 మందికి వైద్యపరీక్షలు నిర్వహించటం జరిగిందని సిఎం పేర్కొన్నారు.. అందరూ సమాజిక దూరంను ఖచ్చితంగా పాటించాలని కోరారు..

రైతులకు ఒంటిగంట వరకు అనుమతి

రైతులకు ఒంటిగంట వరకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. పొల్లాల్లో కూడ సామాజిక దూరం పాటించాలని సిఎం రైతులకు విజ్ఞప్తి చేశారు.

కరోనా సోకినవారిపై చిన్నచూపు తగదు

ఎవరికైనా కరోనా సోకినట్లైదే సదరు వ్యక్తులపై చిన్నచూపు చూడటం తగదని అన్నారు.. వివక్ష చూపొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.. ఎవరికైతే కరోనా సోకిందో వాళ్లకు అప్యాయత, ప్రేమను పంచాలని ఆయన కోరారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/