వైస్సార్సీపీ లో చేరడం ఫై గంటా శ్రీనివాస్ రావు క్లారిటీ ఇచ్చారా..?

గత కొద్దీ నెలలుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు..టీడీపీ పార్టీ ని వీడబోతున్నారని , అధికార పార్టీ వైస్సార్సీపీ లో చేరేందుకు ప్లాన్ చేస్తున్నారని , డిసెంబర్ మొదటి వారం లో వైస్సార్సీపీ లో చేరడం ఖాయమని ఇలా ఎవరికీ వారు ప్రచారం చేస్తూ , మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ ప్రచారం చూసి చాలామంది నిజమే కావొచ్చని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన వైస్సార్సీపీ లో చేరడం ఫై క్లారిటీ ఇచ్చినట్లు ఓ వీడియో ను సోషల్ మీడియా లో టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు.

‘నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు చంద్రబాబు గారితోనే నా ప్రయాణం.. తెలుగుదేశం పార్టీలోనే ఉంటా.. తెలుగుదేశం పార్టీ విజయం కోసం పని చేస్తా.. సోషల్ మీడియాలో ఏవేవో రాస్తుంటారు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. కానీ ఈ వీడియో ఇప్పటిది కాదని , మూడేళ్ల క్రితం గంటా మాట్లాడిన వీడియో అని అంటున్నారు.

2014 సార్వత్రిక ఎన్నికలలో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించాడు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన గంటా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ మంత్రి పదవిని దక్కించుకున్నాడు.

1999లో రాజకీయాల్లో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందాడు. 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రి అయ్యాడు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మానవ వనరుల అభివృద్ధి, ప్రైమరీ ఎడ్యుకేషన్‌, సెకండరీ ఎడ్యుకేషన్‌, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల మంత్రిగా పని చేశాడు.