బిఆర్ఎస్ పార్టీ కి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం షాక్..?

తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ లో అసమ్మతి సెగ మొదలైంది. సోమవారం పార్టీ అధినేత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 119 మందికి గాను 115 అభ్యర్థులను ప్రకటించారు. మరో నలుగుర్ని హోల్డ్ లో పెట్టారు. ఈ క్రమంలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల తో పాటు టికెట్ దక్కుతుందో అని ఎదురుచూసిన వారు సైతం అధిష్టానం ఫై ఆగ్రహం తో ఉన్నారు.

ఈ క్రమంలో సొంత పార్టీ నుండి బయటకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు భరోసా ఇచ్చేందుకు పార్టీ సీనియర్ లీడర్లు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్య కార్యకర్తలతో ఆగస్టు 23న నకిరేకల్ లోని శ్రీనివాస గార్డెన్ లో మీటింగ్ నిర్వహించనున్నారు వీరేశం. అనంతరం ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. నకిరేకల్ నుంచి చిరుమూర్తి లింగయ్యకు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంతో వీరేశం పార్టీ వీడనున్నట్లుగా తెలుస్తోంది.