నాగేశ్వరరావు టైటిల్ తో నాగ చైతు ..

వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న నాగ చైతన్య..తాజాగా సర్కారు వారి పాట ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు నాగ చైతన్య తాత పేరును పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నాగేశ్వర రావు పౌరాణిక, జానపద చిత్రాలతో పాటు మల్టీస్టారర్ చిత్రాలలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

అలాంటి నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా మనం. కొడుకు నాగార్జున మనవళ్ళు నాగ చైతన్య, అఖిల్‌లతో కలిసి ఈ సినిమాను చేశారు. ఇప్పుడు నాగేశ్వరరావు అనే టైటిల్‌తో నాగ చైతన్య సినిమా చేయబోతుండటం విశేషం అని అంత మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ టైటిల్ ఫై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం చైతు థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాల్లో నటించగా , అవి రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.