పవన్ కళ్యాణ్ ఫై కీలక వ్యాఖ్యలు చేసిన వెల్లంపల్లి

వైస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖ సదస్సు విజయవంతం కావడం పట్ల జాతీయ మీడియా మొత్తం సీఎం జగన్ ను కొనియాడిందని, కానీ పచ్చమీడియా మాత్రం ఓర్వలేకపోతోందని విమర్శించారు. పవన్ కల్యాణ్ కు అంబానీ వంటి పారిశ్రామికవేత్తలు కనీసం అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా? అంటూ ఎద్దేవా చేశారు.

దేశ, విదేశీ కార్పోరేట్‌ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన విశాఖ ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023’ భారీ సక్సెస్ కావడం తో వైస్సార్సీపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఏపీకి వచ్చిన పెట్టుబడులు గురించి మాట్లాడారు.

రాష్ట్రంలో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని, రాష్ట్రంలో ప్రత్యక్షంగా 6 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. గతంలో చంద్రబాబు ఇంటి ముందు గూర్ఖాలు సూట్లు తొడిగి ఎంవోయూలు చేసుకునేవారని ఎద్దేవా చేశారు. కానీ, సీఎం జగన్ ఏపీకి అంబానీ, అదానీ, జీఎంఆర్ వంటి బడా పారిశ్రామికవేత్తలను తీసుకువచ్చారని తెలిపారు. విశాఖ సదస్సు విజయవంతం కావడం పట్ల జాతీయ మీడియా మొత్తం జగన్ ను కొనియాడిందని, కానీ పచ్చమీడియా మాత్రం ఓర్వలేకపోతోందని విమర్శించారు. పవన్ కల్యాణ్ కు అంబానీ వంటి పారిశ్రామికవేత్తలు కనీసం అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా? అంటూ ఎద్దేవా చేశారు.