తాలిబాన్‌ అధినేతతో ట్రంప్‌ చర్చలు

మంచి చర్చ జరిగిందని ప్రకటించిన అమెరికా అధినేత

trump-Mullah Baradar
trump-Mullah Baradar

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఆఫ్ఘాన్ ఉగ్రవాద సంస్థ తాలిబాన్ అధినేత ముల్లా బరాదర్ కు, తనకు మధ్య మంచి చర్చ జరిగిందని సంచలన ప్రకటన చేశారు. ఆఫ్ఘనిస్థాన్ లో శాంతిని నెలకొల్పే క్రమంలో ఫలవంతమైన చర్చ జరిగిందని చెప్పారు. ట్రంప్, బరాదర్ మధ్య దాదాపు 35 నిమిషాల పాటు ఫోన్ ద్వారా చర్చలు జరిగాయి. తాలిబాన్ నేతలో ఈరోజు మంచి చర్చ జరిగిందని ఆయన చెప్పారు. బరాదర్ తో ఇంతకు ముందు కూడా మాట్లాడారా? అని మీడియా ప్రశ్నించగా ఆ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదని అన్నారు. ముల్లా బరాదర్ తో మంచి సంబంధం నెలకొందని చెప్పారు. హింసకు తావు లేకుండా చేయాలని వారు కూడా అనుకుంటున్నారని తెలిపారు. కాగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి విడతల వారీగా తమ బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయించిన సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే, ఆఫ్ఘాన్ లో శాంతిని నెలకొల్పే దిశగా తాలిబాన్ నేతతో ట్రంప్ చర్చలు జరిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/