మంత్రి పేర్ని నానిని కలిసిన ఆర్.నారాయ‌ణ మూర్తి

అమరావతి: ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌ల విష‌యంలో వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. అలాగే, సినిమా థియేట‌ర్లను కొంద‌రు స్వ‌చ్ఛందంగా మూసేస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయా అంశాల‌పై చ‌ర్చించ‌డానికి ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి స‌మావేశం అయ్యారు. సినీ రంగానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ఆయ‌న పేర్ని నానితో చ‌ర్చిస్తున్నారు.

కాగా, ఏపీలో సినిమా థియేట‌ర్ల మూసివేత‌పై ఇప్ప‌టికే ఆర్.నారాయ‌ణ మూర్తి ఆవేద‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించాలని ఆయ‌న కోరారు. ఈ నేపథ్యంలో మంత్రి నానితో ఈ రోజు ఆయ‌న భేటీ అయ్యారు. కొన్ని విషయాలు వ్య‌క్తిగ‌తంగా అడిగి తెలుసుకునేందుకు తాను పేర్ని నాని వద్దకు వచ్చానని ఈ సంద‌ర్భంగా ఆర్.నారాయణమూర్తి అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/