పెద్దపల్లి లో కేసీఆర్‌ చిత్రపటానికి ధాన్యంతో అభిషేకం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ధాన్యంతో అభిషేకం చేసి తమ అభిమానాన్ని , ప్రేమను చాటుకున్నారు పెద్దపల్లి జిల్లా రైతులు. సోమవారం పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామంలో పీఏసీఎస్‌ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్బంగా రైతులతో కలిసి కేసీఆర్‌ చిత్రపటానికి ధాన్యంతో అభిషేకం చేసారు. రైతుల కోసం కేసీఆర్ చేస్తున్న సేవలను కొనియాడారు. దేశంలోనే రైతుల కోసం ఆలోచన చేసే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమేనని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పీఏసీఎస్‌ ఛైర్మెన్‌ మాదిరెడ్డి నరసింహా రెడ్డి, యూత్‌ మండలాధ్యక్షుడు కొయ్యడ విక్రమ్‌, సర్పంచ్‌ కొమ్ము శ్రీనివాస్‌,డైరెక్టర్‌ లు, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్నబాబు, నాయకులు సంతోష్‌, రాజు, శ్రీనివాస్‌, నర్సయ్య, పాలకవర్గం, హమాలీలు, తెరాస నాయకులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు