జూలై 30న వరుణ్‌తేజ్ ‘గని’
వరుణ్‌తేజ్ బాక్సర్ పాత్రలో…
‘మెగా ప్రిన్స్’ వరుణ్ తేజ్ హీరోగా ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వరుణ్‌తేజ్ ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ లుక్‌తో బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/