విచిత్రమైన సమస్యతో బాధపడుతున్న అనుష్క

ఈ మధ్య చాలామంది హీరోయిన్స్ రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారి అనారోగ్య సమస్య తెలిసి అభిమానులు బాధపడుతూ, వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా తాజాగా అరుంధతి ఫేమ్ అనుష్క ఓ విచిత్రమైన అనారోగ్య సమస్య తో బాధపడుతుంది. నవ్వు ఆపుకోలేని ఒక విచిత్రమైన సమస్యతో ఆమె ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. ఒక్కసారి నవ్వితే… కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఆమె నవ్వుతూనే ఉంటుందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమే స్వయంగా వెల్లడించింది. తాను నవ్వడం ప్రారంభిస్తే… షూటింగ్ ను కాసేపు ఆపేస్తారని అనుష్క తెలిపారు. తాను అటూ, ఇటూ తిరుగుతూ నవ్వుతూ ఉంటానని చెప్పుకొచ్చింది. ఈ సమస్య తెలిసి అంత షాక్ అవుతున్నారు.

ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే..సూపర్ మూవీ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అనుష్క ..అరుందతి , రుద్రమదేవి వంటి లేడి ఓరియంటెడ్ చిత్రాలను ఆమెను తారాస్థాయికి తీసుకెళ్లాయి. బాహుబలి , బిల్లా, మిర్చి వంటి చిత్రాలను ఆమెకు కమర్షియల్ హీరోయిన్ స్టేటస్ ను తీసుకొచ్చాయి. కెరియర్ జెట్ స్పీడ్ లో ఉన్న సమయంలోబొద్దుగా తయారు కావడంతో ఆఫర్స్ తగ్గాయి. అలాగే వయసు కూడా పెరగడంతో ఆమెకు ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంలో అనుష్క నటిస్తుంది.