ప్ర‌త్య‌ర్థుల పిల్ల‌ల‌ను లాగొద్దంటూ టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ విజ్ఞప్తి..

KTR appeals to TRS leaders to drag opponents’ children

మ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల పిల్ల‌ల‌ను రాజ‌కీయాల్లోకి లాగ‌డం మానుకోవాల‌ని టీఆర్ఎస్ నాయ‌కులు, సోష‌ల్ మీడియా సైనికులంద‌రికీ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. టీఆర్ఎస్ నాయ‌కుడు చేసిన ఓ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. రాజ‌కీయాల్లోకి పిల్ల‌ల‌ను లాగొద్ద‌న్నారు. ఇది అనాలోచితం, ఆమోద‌యోగ్యం కాద‌ని తెలిపారు. సైద్ధాంతిక విధానం, పనితీరు, సమస్యలపై మాట్లాడ‌దామ‌ని తెలిపారు.

ప్రస్తుతం కాలికి గాయం కావడం తో కేటీఆర్ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఇంట్లో జారీ పడడంతో ఎడ‌మ కాలికి గాయ‌మైంది. దీంతో డాక్టర్స్ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని కేటీఆర్‌కు సూచించారు. ఇక నిన్న కేటీఆర్ పుట్టిన రోజు సందర్బంగా పార్టీ నేతలు , కార్యకర్తలు , అభిమానులు పలు సేవ కార్యక్రమాలు చేసి తమ అభిమానాన్ని , ప్రేమను చాటుకున్నారు. అలాగే పలు దేవాలయాల్లో కేటీఆర్ ఫై పలు పూజలు జరిపించారు. త్వరగా కోలుకోవాలని దేవుడ్ని కోరుకున్నారు.