భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలి

టీటీడీని వైస్సార్సీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది

అమరావతి: టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)ని వైస్సార్సీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని టీడీపీ నేత బొండా ఉమ మండిపడ్డారు. తిరుమల పవిత్రను మంటకలిపేలా వ్యవహరిస్తోందని అన్నారు. టీటీడీని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చేసిందని విమర్శించారు. టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో 52 మందికి దేశ వ్యాప్తంగా పదవులను అమ్ముకున్నారని ఆరోపించారు.

ఆర్థిక నేరగాళ్లను, క్రిమినల్స్ ను బోర్డులో ఆహ్వానితుల పేరుతో చొప్పించారని దుయ్యబట్టారు. ఆహ్వానితుల నియామకాలపై కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు. ఇకనుంచైనా భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని హితవు పలికారు. వేంకటేశ్వరస్వామివారి విలువైన కానుకలు ఉన్నాయా? లేక మాయం చేశారా? అంటూ అనుమానాన్ని వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/