జూ. ఎన్టీఆర్ ఫై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీ లో చంద్రబాబు , అయన భార్య భువనేశ్వరిఫై వైసీపీ నేతలు పలు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల ఫై చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత నందమూరి ఫ్యామిలీ సభ్యులు మీడియా ముందుకు వచ్చి వైసీపీ నేతలకు పలు హెచ్చరికలు జారీ చేసారు. రాజకీయాలకు దూరం గా ఉన్న ఎన్టీఆర్ సైతం తన స్పందనను తెలియజేసారు. ఎన్టీఆర్ స్పందన ఫై టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యల్ని ఖండించడంలో మేనల్లుడిగా జూనియర్ ఫెయిల్ అయ్యారని ఘాటైన విమర్శలు చేశారు. జూనియర్‌కు సన్నిహితులుగా చెప్పుకొనే వంశీ, కొడాలినానీ.. హద్దులు మీరి విమర్శిస్తుంటే స్పందించాల్సింది ఇలాగేనా అని ప్రశ్నించారు. సినిమాలు అందరికి ఉంటాయని, కానీ స్పందించాల్సిన చోట నాన్చుడు సరికాదని అన్నారు.

ఎన్టీఆర్‌పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అని టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా అన్నారు. చంద్రబాబు కుటుంబానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ విజయవాడలో వర్ల రామయ్య చేస్తున్న దీక్షకు టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బుద్దావెంకన్న, నాగుల్ మీరా మాట్లాడుతూ… జూనియర్‌పై తమ మనసులో ఉందే… వర్ల రామయ్య బయట పెట్టారన్నారు. జూనియర్ వ్యాఖ్యలు చూసి వైసీపీ నాయకులు ఏంటి జూనియర్ ఇలా మాట్లాడారు అని అనుకుంటున్నారని తెలిపారు. ప్రవచనాలు చెప్పినట్లు జూనియర్ ఎన్టీఆర్ సుభాషితలు పలికారని మండిపడ్డారు. ఒక వర్ల రామయ్య మనసులో మాటే కాదు…తెలుగు ప్రజల భావన అందరిదీ అంతే అని చెప్పుకొచ్చారు.