ఏపీకి భారీ వర్ష సూచనా

parts-of-chennai-under-water-after-heavy-rain-overnight-schools-shut

ఏపీలో మరో నాల్గు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు సమాచారం. బంగాళాఖతంలో ఈ నెల 16న అల్పవాయుపీడనం ఏర్పడి ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ప్రకటించింది. దీని ప్రభావంతో ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

గత నాలుగైదు రోజులుగా రాయలసీమ, దక్షిణ కోస్తాంద్ర ప్రాంతాల్లో కురుస్తున్న వానలు.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయని అనుకునేలోపు మరోసారి రాష్ట్రాన్ని వానలు ముంచెత్తనున్నాయి. అటు ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో నెల్లూరు నగరంలో లో తట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మాగుంట లేఅవుట్‌ అండర్‌ బ్రిడ్జిలోకి వరద నీరు చేరింది. దీంతో మినీ బైపాస్‌ నుంచి జీటీ రోడ్డులోకి వచ్చేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటు భారీ వర్షాలతో అపార్ల్‌మెంట్‌ సెల్లార్‌లోకి నీరు చేరింది. దీంతో వాహనాలు నీట మునిగాయి. కావలిలో కూడా కుండపోత వర్షం కురిసింది. రెండు రోజుల్లో దాదాపు ఐదు సెంటీమీటర్ల వర్షం పాతం నమోదైంది.