వంగవీటి రాధా..జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారా..?

,

ఏపీలో రాజకీయ వేడి రోజు రోజుకు వేడెక్కుతుంది. ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ …ఇప్పటి నుండి నేతలు తమ రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారు. ఏ పార్టీ లో ఉంటె సేఫ్ అనేదానిపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని జనసేన ప్రణాళికలు రచిస్తోంది. గతంతో పోలిస్తే ప్రజల్లో పవన్ కళ్యాణ్ ఫై నమ్మకం పెరిగింది. దాంతో ఇతర నేతలు సైతం జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పటికే రాజోలు వైస్సార్సీపీ కి చెందిన కీలక నేత జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవ్వగా..తాజాగా వంగవీటి రాధా సైతం జనసేన పార్టీ లోకి చేరేందుకు సిద్ధం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయవాడ నగర పరిధిలోని మూడు స్థానాల్లో గత ఎన్నికల్లో అధికార వైస్సార్సీపీ రెండు స్థానాలు గెలవగా.. టీడీపీ ఒక స్థానంలో గెలిచింది. ఇక, రాబోయే ఎన్నికల్లో టీడీపీ ..జనసేనతో పొత్తుతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. పొత్తు పైన అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ, పొత్తు ఖాయమనే ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రాధాను జనసేన తమ పార్టీలోకి ఆహ్వానించింది. కొద్ది రోజుల క్రితం వంగవీటి రాధాతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఆ సమయంలో మర్యాద పూర్వక భేటీ అని, రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పుకొచ్చారు. కానీ, వంగవీటి రాధా రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుంటున్నారని చెపుతున్నారు. గతంలో ప్రజారాజ్యం నుంచి రాధా పోటీ చేసారు. ఆ సంబంధాలతో ఇప్పుడు జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారని ..విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయటం ఖాయమైందని చెబుతున్నారు. మరి నిజంగా ఈ వార్తల్లో నిజం ఉందా లేదా అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.