నేడ ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్‌కు మెజారిటీ పరీక్ష

తమ ఎమ్మెల్యేలంతా తమతో పాటే ఉన్నారని నిరూపించే యత్నంలో కేజ్రీవాల్

Delhi CM Arvind Kejriwal
Delhi CM Arvind Kejriwal

న్యూఢిల్లీః నేడు అసెంబ్లీలో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవల్ బలపరీక్షను ఎదుర్కోబోతున్నారు. బిజెపి తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి లాక్కునేందుకు ప్రయత్నించినప్పటికీ… తమ ఎమ్మెల్యేలు లొంగిపోలేదని… వారంతా ఆప్ లోనే ఉన్నారంటూ… తమ బలాన్ని ఈరోజు ఆయన అసెంబ్లీలో నిరూపించుకోనున్నారు.

మరోవైపు, తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి బిజెపి రూ. 20 కోట్ల చొప్పున ఆఫర్ చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు గత వారం తన నివాసంలో ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఢిల్లీలో ఆప్ కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా… కేజ్రీవాల్ సమావేశానికి 53 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మిగిలిన వారు వర్చువల్ గా హాజరయ్యారని కేజ్రీవాల్ తెలిపారు. తమ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను లాగేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని… అయితే తమ ఎమ్మెల్యేలలో ఒక్కరూ కూడా బిజెపికి లొంగకపోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు.

మరోవైపు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. తాను బిజెపిలో చేరితే తనపై ఉన్న కేసులన్నింటినీ ఎత్తేస్తామని చెప్పారని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/