టీడీపీ నేత పట్టాభిపై ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ పరువు నష్టం దావా

టీడీపీ నేత పట్టాభి ఫై టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ పరువు నష్టం దావా వేశారు. సంకల్ప సిద్ధి గొలుసుకట్టు మోసంలో ఎమ్మెల్యే వంశీ పాత్ర ఉందంటూ పట్టాభి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పట్టాభి ఆరోపణలపై వల్లభ నేని వంశీ రియాక్ట్ అయ్యారు. పట్టాభి తన ప్రతిష్టకు భంగం కల్గించే వ్యాఖ్యలు చేశారంటూ గన్నవరం కోర్టును ఆశ్రయించారు. తన అనుచరులతో కలిసి స్థానిక కోర్టులో ఇ ఈరోజు పరువు నష్టం దావా దాఖలు చేశారు. మరి దీనిపై పట్టాభి ఎలా స్పందిస్తారో చూడాలి.

ఏపీలోని విజయవాడ కేంద్రంగా వెలుగుచూసిన సంకల్ప సిద్ధి కుంభకోణం కేసులో వైస్సార్సీపీ నేతలకు ప్రమేయం ఉందన్న వార్తలపై టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గతంలో స్పందించారు. ఈ కేసు విషయంపై చర్చించేందుకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని సైతం కలిశారు. సంకల్ప సిద్ధి మార్ట్‌ గొలుసుకట్టు మోసం వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదని వంశీ స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కావాలనే తనపై సోషల్ మీడియా లో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తన పరువుకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ఇక ఇప్పుడు అలాగే పరువు నష్టం దావా వేశారు.