పొత్తులపై ఏపీ సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసారు. తోడేళ్లన్నీ ఒకటి అవుతున్నాయని..కానీ నేను సింహాల పోరాడుతానని అన్నారు జగన్. జగనన్న చేదోడు కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ..వెన్నుపోటు దారులకు, మీ బిడ్డ జగన్ కు మధ్య యుద్దం జరుగుతుంది.. మీ బిడ్డ కు పొత్తులు ఉండవు…ఒంటరిగా సింహం లా పోరాడతాడని చెప్పుకొచ్చారు. తోడేళ్ళు అందరు ఒక్కటైనా పేద ప్రజలు ఇచ్చిన బలం తో పోరాటం చేస్తానని అన్నారు. ఎక్కడా వివక్షకు, అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని , రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి మేలు జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు బలహీన వర్గాలను పట్టించుకోలేదు.. గ్రోత్ రేటులో దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉన్నామని వెల్లడించారు.

అంతకు ముందు జగనన్న చేదోడు కార్యక్రమంలో పాల్గొనేందుకు ప‌ల్నాడు జిల్లా వినుకొండ చేరుకున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు హెలిప్యాడు వ‌ద్ద‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సభాస్థలికి వెళ్తుండ‌గా రోడ్లకిరువైపులా ప్ర‌జ‌లు పూల‌వ‌ర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. స్వాగ‌తం ప‌లికిన వారిలో మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజినీ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, కిలారు రోశయ్య, నంబూరి శంకర్ రావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, కలెక్టర్ శివ శంకర్, పలు కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.