జనవరి 12 న వస్తున్న వీరసింహారెడ్డి

నందమూరి బాలకృష్ణ , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. ఇప్పటికే ఈ సినిమా తాలూకా పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ ఇలా అన్ని సినిమా ఫై అంచనాలు పెంచేసాయి.

రిలీజ్ డేట్ ప్రకటిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు. ‘జనవరి 12వ తేదీన వస్తున్నా’ అంటూ బాలయ్య చూపుడు వ్రేలు చూపుతున్న పోస్టర్ ను వదిలారు. క‌న్న‌డ యాక్ట‌ర్ దునియా విజ‌య్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఎస్ఎస్‌. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత బాల‌కృష్ణ.. అనీల్ రావిపూడితో ఓ యాక్ష‌న్ సినిమా చేయ‌నున్నాడు. ఫాద‌ర్‌-డాట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ‘పెళ్ళిసంద‌D’ ఫేం శ్రీలీలా, బాల‌కృష్ణ‌కు కూతురిగా న‌టిస్తుంది.