వకీల్ సాబ్ రివ్యూ అండ్ రేటింగ్

వకీల్ సాబ్ రివ్యూ అండ్ రేటింగ్

ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం ఎట్టకేలకు నేడు థియేటర్లలోకి వచ్చేసింది. దాదాపు మూడేళ్ల తరువాత పవన్ బొమ్మ వెండితెరపై కనిపించడంతో ఆయన అభిమానుల సంతోషానికి ఆకాశమే హద్దుగా మారిపోయింది. ఇక ఇప్పటికే అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సత్యదేవ్(పవన్ కళ్యాణ్) కొన్ని కారణాల వల్ల తన లాయర్ వృత్తిని వదిలిపెడతాడు. కాగా ఓ కేసులో అన్యాయంగా జైలుపాలైన తన స్నేహితురాలు వేముల పల్లవి(నివేధా థామస్)ని కాపాడలంటూ అంజలి, అనన్యాలు సత్యదేవ్ దగ్గరకు వస్తారు. అయితే ఆయన వారికి కొన్ని సూచనలను ఇస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు సత్యదేవ్‌ను భయపెట్టాలని చూస్తారు. దీంతో వేముల పల్లవి కేసును టేకప్ చేసిన సత్యదేవ్, ఆమెను ఏ విధంగా బయటకు తీసుకొస్తాడు? అసలు సత్యదేవ్ లాయర్ వృత్తిని ఎందుకు మధ్యలో ఆపేశాడు? అతడి ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? అనేది సినిమా కథ.

బాలీవుడ్‌లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘పింక్’ సినిమా కథను ఏమాత్రం మార్చకుండా, పవన్ కళ్యాణ్ కోసం కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేసి దర్శకుడు వేణు శ్రీరామ్ తనదైన మార్క్ వేసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో మెచ్యూర్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడని చెప్పాలి. గతకొన్నేళ్లలో పవన్ కళ్యాణ్‌ను ఈ రేంజ్‌లో యాక్ట్ చేయడం మనం చూడలేదు. సినిమాలోని యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్‌లో పవన్ పర్ఫార్మెన్స్ పీక్స్. ఇక ఈ సినిమాలో మరో బెస్ట్ పర్ఫార్మెన్స్ లాయర్ నందగా ప్రకాష్ రాజ్ ఇచ్చాడు. పవన్‌తో సమానంగా ఆయన ఈ సినిమాలో నటించాడు. ఇక టెక్నికల్ పరంగా ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం, ముఖ్యంగా బీజీఎం సూపర్బ్. ఈ సినిమా కోసం దిల్ రాజు పెట్టిన ఖర్చు మనకు సినిమా చూస్తే ఇట్టే అర్థమవుతోంది. మొత్తానికి చాలా కాలం తరువాత పవన్ తన అభిమానులకు వకీల్ సాబ్ చిత్రంతో ఫుల్ ట్రీట్ ఇచ్చాడని చెప్పాలి.

చివరగా:
వకీల్ సాబ్ – పవన్ కళ్యాణ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్!

రేటింగ్:
3.5/5.0