18 పేజెస్ ఫస్ట్ డే కలెక్షన్స్

కార్తికేయ 2 ఫేమ్ నిఖిల్ – అనుపమ జంటగా ప్రతాప్ తెరకెక్కించిన ప్రేమ కథ చిత్రం 18 పేజెస్. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుండి వస్తున్న సినిమా కావడం..ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉంటుందని అనుకున్నారు కానీ ప్రేక్షకుల అంచనాలు తలకిందులు అయ్యాయి. ప్రేమ కథ చిత్రానికి క్రైమ్ జోడించడం..అది కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం తో ప్రేక్షకులు నిరాశకు గురి అయ్యారు. అయితే నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ఆన్ స్క్రీన్ బాండింగ్ ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఫీల్‌గుడ్ మూవీ అనే అభిప్రాయాన్ని సొంతం చేసుకొన్నది.

ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే..దేశ వ్యాప్తంగా ఈ సినిమా 3 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉందని అంటున్నారు. ఓవర్సీస్‌లో కలుపుకొంటే ఈ చిత్రం 3.5 నుంచి 4 కోట్ల షేర్, 7 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 12.75 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంది.