కరోనా బారినపడిన మహానటి

కరోనా బారినపడిన మహానటి

మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కరోనా బారినపడింది. దేశ వ్యాప్తంగా మూడో వేవ్ ఉదృతంగా కొనసాగుతుంది. ప్రతి రోజు లక్షల సంఖ్య లో కరోనా కేసులు పుట్టుకొస్తుండడం తో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. ఇక ఈసారి కూడా కరోనా బారిన పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు పడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు , రాజేంద్ర ప్రసాద్ , త్రిష , మంచు లక్ష్మి , వరలక్ష్మి శరత్ కుమార్ , మీనా , థమన్ , రేణు దేశాయ్ , అకిరా మొదలగు వారు కరోనా బారినపడి చికిత్స తీసుకుంటుండగా..తాజాగా కీర్తి సురేష్ సైతం కరోనా బారినపడింది.

గత రెండు రోజుల నుంచి జలుబు తో బాధపడుతున్న హీరోయిన్ కీర్తిసురేష్ తాజాగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ కీర్తి సురేష్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. “ప్రస్తుతం నేను హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాను. డాక్టర్ల సూచన మేరకు కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నా, నన్ను కలిసిన వారు కరోనా టెస్టు లు చేయించుకోండి. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుని, జాగ్రత్తలు పాటించాలని వినతి. ” అంటూ హీరోయిన్ కీర్తి సురేష్ ట్వీట్ చేసింది. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో మహేష్ బాబు కు జోడిగా సర్కారు వారి పాట మూవీ లో నటిస్తుంది. ఏప్రిల్ నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.